ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
అనంతపురం జిల్లా – ఈ దేశంలో పేదలను ఆదుకున్న ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న వారికి తగిన రీతిలో బుద్ది చెప్పాలన్నారు.
అనంతపురంలో ఏఐసీసీ నిర్వహించిన తొలి భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇందిరమ్మ అభయం పేదలను బాగు చేసేందుకు ఉద్దేశించిన గ్యారెంటీ పథకమని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలో వస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు 5 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు మల్లికార్జున్ ఖర్గే. కాంగ్రెస్ గ్యారెంటీ ఇచ్చింది అంటే అమలు చేసి తీరుతుందన్నారు. ఈ గ్యారెంటీ మా గుండెల్లో ఉంటుందని చెప్పారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గత 10 ఏళ్లుగా తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్. ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి కూడా ఏపీకి రాలేదని ఆవేదన చెందారు. దేశం గర్వించే నాయకుడు రాజశేఖర్ రెడ్డిని ఈ ప్రాంతం ఇచ్చిందన్నారు ఏఐసీసీ చీఫ్.
మహా నేత కూతురు షర్మిలా రెడ్డికి బాధ్యతలు అప్పగించామని, ఆమెను ఆశీర్వదించాలని కోరారు . మోదీ నిత్యం కాంగ్రెస్ పార్టీ జపం చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు.