NEWSNATIONAL

రాజీవ్ జీవితం చిర‌స్మ‌ర‌ణీయం

Share it with your family & friends

ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే
బెంగ‌ళూరు – దివంగత ప్ర‌ధాన‌మంత్రి రాజీవ్ గాంధీ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. ఈ దేశ అభివృద్ది కోసం ఆయ‌న చేసిన కృషి గొప్ప‌ద‌న్నారు. యువ‌తీ యువ‌కులు లేక పోతే భ‌విష్య‌త్తు లేద‌ని అన్నారు.

త‌న బ‌తికింది కొద్ది కాల‌మే అయినా రాజీవ్ గాంధీ ముద్ర నేటికీ కొన‌సాగుతోంద‌న్నారు. ఈ దేశానికి ఆయ‌న వ‌ల్ల‌నే టెక్నాల‌జీ వ‌చ్చింద‌ని చెప్పారు. ఇవాళ టెలికాం ప‌రంగా భార‌త్ కు తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త రాజీవ్ కే ద‌క్కుతుంద‌న్నారు.

ఆయ‌న ముందు చూపుతో ఆలోచించ‌డం వ‌ల్ల‌నే ఇవాళ భార‌త్ ప్ర‌పంచంతో పోటీ ప‌డుతోంద‌న్నారు. టెక్నాల‌జీ ప‌రంగా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించ‌డం గొప్ప‌ద‌న్నారు ఏఐసీసీ చీఫ్‌. కానీ అనుకోకుండా కొంద‌రు ప‌న్నిన కుట్ర‌కు బ‌ల‌మ‌య్యాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రాజీవ్ గాంధీ ఇవాళ భౌతికంగా మ‌న‌మధ్య లేక పోయినా ఆయ‌న దేశం కోసం ప‌డిన త‌ప‌న‌, చేసిన ప‌నులు ఎల్ల‌ప్ప‌టికీ నిలిచే ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. బెంగ‌ళూరులో రాజీవ్ గాంధీ కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డం ఆనందంగా ఉందన్నారు. సిటీ త్వ‌ర‌లో సిగ్న‌ల్ ఫ్రీ 8 లేన్ కారిడార్ రానుంద‌న్నారు.