బీజేపీ నియంతృత్వం చెల్లదు
నిప్పులు చెరిగిన ఏఐసీసీ చీఫ్
న్యూఢిల్లీ – మోదీ తాను మాత్రమే ప్రధానిగా ఉండాలని, బీజేపీ ఎల్లకాలం ఒక్కటే పార్టీగా ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటున్నాడని కానీ ఇది జరగని పని అని హెచ్చరించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. ఆదివారం భారత కూటమి ఆధ్వర్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ ర్యాలీ చేపట్టారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవాలని, లేకపోతే అత్యంత ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆరు నూరైనా ఎవరిని జైల్లో పెట్టినా ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ఓ వైపు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ మూకుమ్మడిగా , పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు ఖర్గే. ఇది ఎంత మాత్రం తగదన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ ఏం తప్పు చేశాడని ప్రశ్నించారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఒక్కటే తను ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండడం మాత్రమేనని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా కూటమిని చూసి మోదీ జంకుతున్నట్లు అనిపిస్తోందన్నారు. ఏది ఏమైనా ఎంత కాలం ఇలా కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తారంటూ నిప్పులు చెరిగారు ఖర్గే.
ఎవరు క్షమించినా ప్రజలు మోదీని క్షమించ బోరని అన్నారు. ఇకనైనా పీఎం మారితే బెటర్ అని పేర్కొన్నారు.