NEWSNATIONAL

మోడీ వ‌ల్ల ఒరిగింది ఏమీ లేదు

Share it with your family & friends

ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

న్యూఢిల్లీ – ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల‌లో ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నారు. త‌మిళ‌నాడులోని స్వామి వివేకానందుడు న‌డ‌యాడిన కన్యాకుమారిలో మోడీ ప్ర‌స్తుతం ధ్యానంలోకి వెళ్లి పోయారు. ఆయ‌న రేప‌టి వ‌ర‌కు అంటే జూన్ 1 శ‌నివారం రాత్రి వ‌ర‌కు 48 గంట‌ల పాటు మౌన ముద్ర‌లో ఉంటారు.

దీంతో యావ‌త్ మీడియా అంతా ఆయ‌న‌పై ఫోక‌స్ పెట్టింది. ఇక మాజీ సీఎం భూపేష్ బ‌ఘేల్ అయితే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న‌ను దేవుడు అంటున్నారు. మ‌రి దేవుడికి ధ్యానం తో ప‌నేంటి అంటూ ప్రశ్నించారు. ఇదంతా వ్య‌క్తిగ‌త ప్ర‌చారం త‌ప్ప ఇంకోటి కాద‌న్నారు.

ఇక మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే జాతీయ మీడియాతో మాట్లాడుతూ మోడీ వ‌ల్ల ఈ దేశానికి న‌ష్టం త‌ప్ప ఒరిగింది ఏమీ లేద‌న్నారు. కేవ‌లం కొద్ది మందికి లాభం చేకూర్చేలా త‌ను నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని ఒక ర‌కంగా చెప్పాలంటే ఆయ‌న ఉన్న‌ది దేశం కోసం ప్ర‌ధాని కాద‌ని కొద్ది మంది బిలియ‌న‌ర్లీకు మాత్ర‌మేనంటూ ఎద్దేవా చేశారు.