కాంగ్రెస్ జెండా అభివృద్దే ఎజెండా
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
కర్ణాటక – ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం తమ పార్టీ లక్ష్యమని అన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. ఈ దేశంలో మోదీ వచ్చాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. బీజేపీ కేవలం మతం పేరుతో మనుషుల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు పొందాలని చూస్తోందని అన్నారు ఖర్గే.
కర్ణాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐదు గ్యారెంటీలను అమలు చేయడంలో ఫోకస్ పెట్టిందన్నారు. ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా చూస్తున్నామని చెప్పారు. మోదీజీ హామీలకు భిన్నంగా తాము ఆచరణలో చేసి చూపించామని అన్నారు ఖర్గే.
మహిళా శక్తి ద్వారా ఇప్పటి వరకు 170,05,37,993 ట్రిప్పులలో ప్రయాణం చేశారని తెలిపారు. గృహలక్ష్మి పథకం కింద 1,22,08,292 మంది లబ్ధి పొందారని చెప్పారు. అన్న భాగ్య పథకం కింద 4,33,46,779 వ్యక్తిగతంగా లబ్ది పొందినట్లు తెలిపారు. యువ నిధి కింద1,34,759 మంది లబ్ధిదారులకు మేలు చేకూరిందన్నారు. కర్ణాటక లోని కలబురగిలో జరిగిన సభలో ఖర్గే పాల్గొని ప్రసంగించారు.