దేశమంటే ఏపీ..బీహారేనా..?
నిప్పులు చెరిగిన ఏఐసీసీ చీఫ్
న్యూఢిల్లీ – దేశమంటే అన్ని రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలని ఆ మాత్రం తెలియకుండా పాలన సాగిస్తున్నారా అంటూ నిలదీశారు..నిప్పులు చెరిగారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్బంగా మిగతా రాష్ట్రాలను ఎందుకు పట్టించు కోలేదని మండిపడ్డారు. దేశమంటే కేవలం ఏపీ, బీహారేనా అని ప్రశ్నించారు ఖర్గే. అసలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సోయి అన్నది ఉందా అని ధ్వజమెత్తారు. దేశానికి భారంగా ప్రభుత్వం మారిందని ఆరోపించారు.
ఇది దేశాన్ని ప్రతిబింబించేలా బడ్జెట్ లేదన్నారు. కేవలం ఏపీ, బీహార్ లకు మాత్రమే నిధులు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నించారు. మిగతా తెలంగాణ, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక , తదితర రాష్ట్రాల పరిస్థితి ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఖర్గే.
ఇది పూర్తిగా వివక్ష పూరితమైనదే తప్పా ఎక్కడా ప్రజాస్వామ్య స్పూర్తి కనిపించ లేదని ధ్వజమెత్తారు . బేషరతుగా కేంద్ర సర్కార్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.