వివరణ ఇచ్చిన కాంగ్రెస్
పశ్చిమ బెంగాల్ – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీపై దాడి జరిగిందని, బస్సు అద్దాలు పగిలి పోయాయంటూ పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ఏఐసీసీ. బుధవారం కీలక ప్రకటన చేసింది. రాహుల్ గాంధీపై ఎలాంటి దాడులు జరగలేదని స్పష్టం చేసింది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఇండియా కూటమిలో కొనసాగుతూ వస్తున్న టీఎంసీ చీఫ్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నట్టుండి గుడ్ బై చెప్పారు. ఇదే సమయంలో రాహుల్ యాత్రకు మద్దతు ఇవ్వలేదు. దీంతో దాడి జరుగుతుందని అంతా భావించారు.
ఇదే సమయంలో దుష్ప్రచారం జరగడాన్ని తీవ్రంగా ఖండించింది కాంగ్రెస్ పార్టీ. ఇదిలా ఉండగా ఇవాళ చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి వివరణ ఇచ్చింది. బెంగాల్ లోని మాల్డాలో రాహుల్ ను కలిసేందుకు భారీగా జనం తరలి వచ్చారని తెలిపింది. ఒక మహిళ అకస్మాత్తుగా తనను కలిసేందుకు వచ్చిందని, ఈ సమయంలో బ్రేక్ లు వేయడంతో అద్దాలు పగిలి పోయాయని పేర్కొంది.