ప్రకటించిన ఏఐసీసీ హైకమాండ్
ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. ఎవరూ ఊహించని రీతిలో రాములమ్మకు సీటు దక్కడం విశేషం. ఆదివారం పార్టీ హైకమాండ్ ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. ముందు నుంచి పార్టీ కోసం పని చేస్తూ వచ్చిన పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్ , తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, ఎన్నికల ప్రచారంలో ముఖ్య భూమిక పోషించిన విజయశాంతికి, శంకర్ నాయక్ ను అభ్యర్థులుగా ఖరారు చేసింది. ఇంకో సీటును మిత్ర పక్షం సీపీఐకి కేటాయించినట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు రెడీ కావాలని స్పష్టం చేసింది ఏఐసీసీ. ఈ మేరకు అధికారికంగా వెల్లడించారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. అద్దంకి దయాకర్ అధికారంలో ఉన్నా లేకున్నా తాను పార్టీ కోసం కష్టపడ్డారు. ప్రజల గొంతుకగా ఉన్నారు. ఆయన సీఎంకు , పార్టీకి లాయల్ గా ఉన్నారు. ఇదే సమయంలో విజయశాంతి గత కొంత కాలంగా మౌనంగా ఉన్నారు. ఎప్పుడైతే రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ వచ్చారో ఎందుకు దూరంగా ఉన్నారనే దానిపై ఆరా తీశారు.
ఏఐసీసీ పెద్దలతో జరిగిన చర్చల్లో విజయశాంతికి తప్పకుండా ఇవ్వాలని సూచించారు. నల్లగొండ జిల్లా పీసీసీ అధ్యక్షుడిగా పని చేస్తున్న శంకర్ నాయక్ కు ఛాన్స్ ఇచ్చారు. ఇక మహిళా కోటాలో రాములమ్మకు ప్రయారిటీ ఇచ్చారు.