పశ్చిమ బెంగాల్ లో లా అండ్ ఆర్డర్ ఫెయిల్
ఏఐఎఫ్ఎఫ్ ప్రెసెడింట్ కళ్యాణ్ చౌబే కామెంట్స్
కోల్ కతా – ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేయడం కలకలం రేపింది.
ఆదివారం కోల్ కతాలో డాక్టర్ అత్యాచారం ఘటనకు సంబంధించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా చేపట్టిన ర్యాలీకి మద్దతు ఇస్తూ..తను కూడా పాల్గొన్నారు.
తన గొంతు పెంచారు. ఇది పూర్తిగా అమానుషం. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని విపత్కర పరిస్థితి నెలకొందన్నారు కళ్యాణ్ చౌబే.
ఇది పూర్తిగా అవమానకరమైదని అన్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్ జరగలేదు… పోలీసుల మోహరింపు చూస్తుంటే అల్లర్లు జరుగుతున్నట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.
సాల్ట్‌లేక్ స్టేడియంలో ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్ మధ్య డెర్బీ మ్యాచ్ రద్దు కావడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో ఒకరు ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరగాల్సిందేనని అన్నారు.