మోడీకి అంత సీన్ లేదు
అజయ్ రాయ్ కామెంట్
ఉత్తర ప్రదేశ్ – యూపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ , వారణాసి లోక్ సభ ఎంపీ అభ్యర్థి అజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన తన విలువైన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం అజయ్ రాయ్ మీడియాతో మాట్లాడారు.
ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏకి పారేశారు. ఆయనకు అంత సీన్ లేదంటూ ఎద్దేవా చేశారు. ప్రజలను ఎంత కాలం ఇలా మభ్య పెడుతూ వస్తారని ప్రశ్నించారు. ఇవాళ ప్రజలు తనను ఆశీర్వదించేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు.
వారణాసి వాసులు స్థానికుడైన తనను కోరుకుంటున్నారని, ఇకా కాశీ విశ్వనాథుడు తన పట్ల సానుకూలంగా ఉంటాడని ఆశిస్తున్నట్లు తెలిపారు అజయ్ రాయ్. గతంలో కూడా చాలా మంది ప్రధానమంత్రులుగా ఉన్న వారు తమ తమ లోక్ సభ స్థానాలలో ఓడి పోయిన సంఘటనలు లేక పోలేదన్నారు .
ఈసారి కచ్చితంగా తాను విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు అజయ్ రాయ్.