మోడీ కంటే నేనే గొప్ప భక్తుడిని
కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్
ఉత్తర ప్రదేశ్ – యూపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ , వారణాసి లోక్ సభ స్థానం నుండి అభ్యర్థిగా బరిలోకి దిగిన అజయ్ రాయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. భక్తి అంటేనే బీజేపీ అనే స్థితిలోకి తీసుకు వచ్చారని, కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేయడంతో ఓట్లు రాలుతాయని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు.
శనివారం అజయ్ రాయ్ మీడియాతో మాట్లాడారు. మోడీ కంటే నేనే గొప్ప భక్తుడినంటూ చెప్పారు. ఆయన కేవలం ప్రచారం కోసం తప్ప పని చేయడంపై ఫోకస్ పెట్టడం లేదన్నారు. వారణాసి ప్రజలు మోడీని నమ్మే స్థితిలో లేరన్నారు.
వారణాసిలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు అజయ్ రాయ్. నేను కాశీ కుమారుడిని, ఇక్కడ గుడిలో నిత్యం ప్రార్థనలు చేస్తూనే ఉంటానని, కానీ ఎక్కడా ప్రచారం చేసుకోనంటూ స్పష్టం చేశాడు. కాశీ బాబా విశ్వనాథుని త్రిశూలం మీద నిలబడి ఉందన్నారు. నేను దేని కోసం ప్రార్థించాల్సి వచ్చినా ఇక్కడే ప్రార్థన చేస్తాను తప్ప ఇతర చోట్లకు వెళ్లనంటూ కుండ బద్దలు కొట్టారు అజయ్ రాయ్.