ఫిట్ నెస్ వల్లే పాండ్యా డ్రాప్
స్పష్టం చేసిన అజిత్ అగార్కర్
ముంబై – దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్షన్ కమిటీ ఎంపిక. తాజాగా శ్రీలంక పర్యటనకు సంబంధించి భారత జట్లను ఎంపిక చేశారు. సోమవారం తొలిసారిగా భారత క్రికెట్ హెడ్ కోచ్ గా ఎంపికైన గౌతమ్ గంభీర్ తో కలిసి సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడారు.
టి20 జట్టుకు సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ గా ఎంపిక చేయడానికి గల కారణాలు వివరించారు. ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే సమస్య ఉండదన్నారు. ఇక అమెరికా, విండీస్ సంయుక్తంగా నిర్వహించిన ఐసీసీ ట20 వరల్డ్ కప్ లో సూర్యతో పాటు హార్దిక్ పాండ్యా కీలకంగా వ్యవహరించారని చెప్పారు.
సెలెక్షన్ ఎంపిక అనేది క్లిష్టతరమైన వ్యవహారమని, తాము అన్నింటిని పరిశీలించే , ఆటగాళ్లు ఎక్కడ ఏ ఫార్మాట్ లో సరిపోతారనే దానిపై విస్తృతంగా చర్చిస్తామని, ఆ తర్వాతే అంతిమంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశాడు అజిత్ అగార్కర్.
సంజూ శాంసన్ ను ఎందుకు వన్డే సీరీస్ ఎంపిక చేయలేదన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వకుండా దాట వేసే ప్రయత్నం చేశారు. ఇక ఫిట్ నెస్ పరంగా ఫిట్ కాక పోవడంతోనే సూర్యకు ఛాన్స్ ఇచ్చామన్నారు సెలెక్షన్ కమిటీ చైర్మన్.