Tuesday, April 22, 2025
HomeDEVOTIONALఅజ్మీర్ ద‌ర్గాపై పిటిష‌న్ స్వీక‌ర‌ణ

అజ్మీర్ ద‌ర్గాపై పిటిష‌న్ స్వీక‌ర‌ణ

అది హిందూ దేవాల‌యం అంటూ దావా

గుజ‌రాత్ – అజ్మీర్ షరీఫ్ దర్గా హిందూ దేవాలయమని దావా వేసిన పిటిషన్‌ను స్వీకరించింది కోర్టు. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాను ‘భగవాన్ శ్రీ సంకత్మోచన్ మహాదేవ్ విరాజ్‌మాన్ ఆలయం’గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ హిందూ సేన గ‌త సెప్టెంబర్‌లో రాజ‌స్తాన్ అజ్మీర్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ దావాను విచారించేందుకు కోర్టు అనుమ‌తించింది. సూఫీ సన్యాసి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమాధి శివాలయమని హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్‌ను అజ్మీర్‌లోని దిగువ కోర్టు అంగీకరించింది.

హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా ఈ దావా దాఖ‌లు చేశారు. దీనిపై విచారించేందుకు డిసెంబ‌ర్ 20న తేదీ ఖ‌రారు చేసింది కోర్టు.

ఇదిలా ఉండ‌గా ఈ వ్యవహారంలో అజ్మీర్ షరీఫ్ దర్గా కమిటీ, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)కి సమన్లు ​​జారీ చేయాలని కోర్టు ఆదేశించింది.

ఇది ప్రామాణికమైన మూలాల నుండి వచ్చిన వాస్తవాలపై ఆధారపడి ఉందని, సూఫీ మందిరాన్ని ప్రాంగణం నుండి తొలగించాలని పిటిషన్‌లో కోరారు.

వారణాసిలోని జ్ఞానవాపి సర్వే తరహాలో ఆ స్థలంలో సర్వే నిర్వహించి, ఆ ప్రదేశంలో శివాలయాన్ని పునర్నిర్మించాలని హిందూ సేన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు విన్న‌వించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments