సయ్యద్ జైనుల్ షాకింగ్ కామెంట్స్
ఇండియా కూటమిపై ఆగ్రహం
న్యూఢిల్లీ – ప్రసిద్ద దర్గా ఆజ్మీర్ దర్గా దీవాన్ సయ్యద్ జైనుల్ అబేదీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇండియా కూటమి నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వీరి కామెంట్స్ కారణంగా జనం అయోమయానికి లోనవుతున్నారని వాపోయారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం అన్ని రంగాలలో ముందంజలో కొనసాగుతోందన్నారు. గతంలో లేనంతగా పురోభివృద్ది దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. పొద్దస్తమానం తిడుతూ కూర్చుంటే ఎలా అని ప్రశ్నించారు దీవాన్ సయ్యద్ జైనుల్ అబేదీన్.
దేశం, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే రాజ్యాంగ పరమైన సవరణలు చేయడంలో తప్పు లేదన్నారు. తాను ఉమ్మడి పౌర స్మృతి చట్టానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు అబేదీన్.