ఓవైసీ షాకింగ్ కామెంట్స్
జైలుకు పంపాలని చూస్తున్నారు
హైదరాబాద్ – రాష్ట్రంలో ఎన్నికలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ప్రధానంగా పాత బస్తీలో ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్య హోరా హోరీ పోరు నడుస్తోంది. ఇక్కడ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ బరిలో ఉన్నారు. బీజేపీ తరపున కొంపెల్లి మాధవీలత పోటీ చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఓవైసీ బ్రదర్స్. మంగళవారం ఇందులో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఓవైసీ సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. తనను , సోదరుడిని కలిపి జైలుకు పంపించాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు.
జైలులో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేయాలని పకడ్బందీ ప్లాన్ వేశారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. కానీ హైదరాబాద్ ప్రజలతో తమకు అనాది నుంచి విడదీయలేని బంధం ఉందన్నారు. తమను విడదీసే శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదని స్పష్టం చేశారు ఓవైసీ.