ముస్లింలు చొరబాటుదారులా
మోదీపై భగ్గుమన్న అక్బరుద్దీన్
హైదరాబాద్ – ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు. ఎన్నికల సందర్బంగా మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు ఓవైసీ.
ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ దేశంలోని ముస్లింలు చొరబాటుదారులు ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. తమ పిల్లలు ఈ దేశానికి చెందిన వారు కాకుండా పోతారా అని నిలదీశారు. ఇలాగేనా ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడేది అంటూ మండిపడ్డారు అక్బరుద్దీన్ ఓవైసీ.
అటల్ బిహారీ వాజ్‌పేయికి ఎంత మంది తోబుట్టువులు ఉన్నారో తెలుసా అని ఫైర్ అయ్యారు . ఆయన తోబుట్టువుల సంఖ్య ఏడుగురు ఉన్నరాని, అలాగే యూపీ సీఎం గా ఉన్న యోగి ఆదిత్యానాథ్ తోబుట్టువుల సంఖ్య ఏడుగురని , అమిత్ షా కుటుంబీకులు కూడా ఏడు మందికి పైగా ఉన్నారని చెప్పారు.
ఈ దేశానికి తాజ్ మహల్ , కుతుబ్ మినార్ , జామా మసీదు, చార్మినార్ ను కట్టించిన వారంతా ఈ దేశానికి చెందిన వారు కాదా అని భగ్గుమన్నారు.