మహిళ బాధ ఏమిటో మమతకు తెలుసు
మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కామెంట్స్
ఢిల్లీ – సమాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కోల్ కతాలో చోటు చేసుకున్న డాక్టర్ అత్యాచార ఘటనపై స్పందించారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు. సీఎం మమతా బెనర్జీ కూడా ఓ మహిళనే. ఆమెకు సాటి మహిళల పట్ల సానుకూల అభిప్రాయం ఉంది. డాక్టర్ ఘటన తనతో పాటు ప్రతి ఒక్కరినీ కదిలించి వేసింది.
దీనిపై ప్రతి ఒక్కరం ఖండిస్తున్నాం. ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకూడదని కోరుకున్నాం. కానీ పనిగట్టుకుని ప్రతిదానిని రాజకీయం చేయడం భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు అఖిలేష్ యాదవ్. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని సూచించారు మాజీ సీఎం.
విచారణకు సీఎం ఆదేశించారు. అయినా కొందరు కావాలని రాద్దాంతం చేయడాన్ని తప్పు పట్టారు. దోషులు ఎంతటి వారైనా సరే శిక్ష పడాల్సిందేనని అన్నారు అఖిలేష్ యాదవ్. రాష్ట్ర రాజధాని కోల్ కతాలో పెద్ద ఎత్తున సీఎం మమతా బెనర్జీ పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేపట్టారని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
బీజేపీ రాజకీయాలు చేయడం మానుకుని దేశంలో చోటు చేసుకున్న ఇతర ప్రధాన సమస్యలపై ఫోకస్ పెడితే బావుంటుందని సూచించారు మాజీ సీఎం.