భారత కూటమిదే విజయం
పిలుపునిచ్చిన అఖిలేష్ యాదవ్
ఉత్తర ప్రదేశ్ – భారత కూటమిదే అంతిమ విజయమని పేర్కొన్నారు సమాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ 400 సీట్లు వస్తాయని చెప్పడం దారుణమన్నారు. జనం మోడీ మాటలను నమ్మే స్థితిలో లేరన్నారు.
ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దేశాన్ని సర్వ నాశనం చేసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వ రంగ సంస్థలను గంప గుత్తగా అదానీ, అంబానీలకు కట్టబెట్టారని , దేశాన్ని సర్వ నాశనం చేశారని ఆరోపించారు అఖిలేష్ యాదవ్.
జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు సందర్బంగా భారత కూటమికి చెందిన ఆయా పార్టీల నేతలు, ప్రతినిధులు , ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు టాంపరింగ్ కు పాల్పడే ఛాన్స్ ఉందని హెచ్చరించారు మాజీ సీఎం.