NEWSNATIONAL

మోదీ నిర్వాకం అఖిలేష్ ఆగ్ర‌హం

Share it with your family & friends

దేశంలో ప్ర‌మాదంలో ప్ర‌జాస్వామ్యం

న్యూఢిల్లీ – స‌మాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ నిప్పులు చెరిగారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై భగ్గుమ‌న్నారు. ఆప్ ఎంపీ సంజ‌య్ ఆజాద్ సింగ్ తో క‌లిసి ఆయ‌న శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు.

ఎలాంటి ఆధారాలు లేకుండానే ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ పేరుతో ఇబ్బందుల‌కు గురి చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. మోదీకి ఎన్నిక‌ల్లో ఓడి పోతామోన‌ని భ‌యం ప‌ట్టుకుంద‌ని, అందుకే ప్ర‌తి ఒక్క‌రిని చూసి శ‌త్రువుగా భావిస్తున్నార‌ని, అందుకే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో దాడులు చేయిస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

కాలం ఎప్పుడూ ఒకే లాగా ఉండ‌ద‌ని, ఆ విష‌యం ప్ర‌ధాన‌మంత్రి మోదీ తెలుసుకుంటే మంచిద‌ని అన్నారు అఖిలేష్ యాద‌వ్. ఇవాళ జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ ఎలాగైనా స‌రే గెల‌వాల‌ని అనుకుంటోంద‌ని ఆరోపించారు.

ఇప్ప‌టికే ఎల‌క్టోర‌ల్ బాండ్ల వ్య‌వ‌హారం మోదీని, ఆయ‌న పార్టీని, మంత్రివ‌ర్గాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంద‌ని చెప్పారు. ఇక‌నైనా వాస్త‌వాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంద‌న్నారు. ప్ర‌చారం త‌ప్ప ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఏనాడైనా మోదీ ప‌రిష్క‌రించారా అని ప్ర‌శ్నించారు.

సంజ‌య్ సింగ్ ద‌మ్మున్నోడ‌ని కితాబు ఇచ్చారు. తాము ఎవ‌రం ఈడీ, సీబీఐ, ఐటీ దాడుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేదంటూ ప్ర‌కటించారు.