మోదీ మోసం దేశానికి నష్టం
ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్
ఉత్తర ప్రదేశ్ – సమాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వ పాలనలో దేశం అన్ని రంగాలలో వెనక్కి వెళ్లిందని వాపోయారు. కేవలం కులం, మతం ఆధారంగా రాజకీయాలు చేయడం , ఓటర్లను ప్రభావితం చేయడం తప్పితే ప్రధానమంత్రి దేశానికి చేసింది ఏమీ లేదని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు అఖిలేష్ యాదవ్. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే పనిలో పడిందని ఆరోపించారు. ఈసారి గనుక ప్రజలు మేల్కోక పోతే అత్యంత ప్రమాదంలో పడతారని హెచ్చరించారు.
మోదీ కేవలం కోటీశ్వరులు, బిలీయనీర్లు, వ్యాపారవేత్తలు, బడా బాబులకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారే తప్పా చేసింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను గంప గుత్తగా అప్పగించే పనిలో పడ్డాడని, ఈసారి గనుక గెలిస్తే మొత్తం దేశాన్నే అమ్మేస్తాడని సంచలన ఆరోపణలు చేశారు అఖిలేష్ యాదవ్.