నాన్నా నీ జీవితం స్పూర్తి దాయకం
అకిరా నందన్ కొణిదల కామెంట్స్
ముంబై – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు పురస్కరించుకుని తన తనయుడు అకిరా నందన్ కొణిదల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను చేసిన ట్వీట్ కు భారీ ఎత్తున స్పందన వచ్చింది. ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
తన తండ్రిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ మెరుగైన సమాజం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు, పోరాటాన్ని తాను అభినందిస్తున్నానని తెలిపారు.
మీ త్యాగం నాలాంటి లక్షలాది హృదయాలను గెలుచుకుందని స్పష్టం చేశారు అకిరా నందన్ కొణిదల, మా జీవితంలో మీలాంటి వారు ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ పుట్టినరోజు మిమ్మల్ని మరింత యవ్వనంగా మార్చాలని , నిండు నూరేళ్లు హాయిగా , ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు అకిరా నందన్ కొణిదల. నాన్నా మీకు హృదయ పూర్వకమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు..అభినందనలు అంటూ ప్రశంసించారు.