ENTERTAINMENT

కూల్చి వేత చ‌ట్ట విరుద్దం – నాగార్జున

Share it with your family & friends

నోటీసు ఇవ్వ‌కుండా ఎలా కూలుస్తారు

హైద‌రాబాద్ – తాము ఎలాంటి ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డ లేద‌న్నారు న‌టుడు అక్కినేని నాగార్జున‌. శ‌నివారం ముంద‌స్తు నోటీసు లేకుండా త‌న‌కు చెందిన ఎన్ – క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ను ఎలా కూల్చుతారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఇది మంచి పద్ద‌తి కాద‌న్నారు. అది పూర్తిగా ప‌ట్టా భూమి అని స్ప‌ష్టం చేశారు. దీనికి ప్లాన్ కూడా ఉంద‌న్నారు. అప్రూవ‌ల్ రావ‌డంతో నిర్మించిన‌ట్లు తెలిపారు.

ఇందుకు సంబంధించి కోర్టులో కేసు న‌డుస్తోంద‌ని, ఈ స‌మ‌యంలో తీర్పు రాకుండానే ఎలా ధ్వంసం చేస్తారంటూ నిల‌దీశారు. దీనిపై తాము కోర్టుకు వెళ‌తామ‌ని, త‌మ‌కు న్యాయ స్థానం ప‌ట్ల గౌర‌వం ఉంద‌న్నారు అక్కినేని నాగార్జున‌.

త‌మ ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీసేందుకు జ‌రుగుతున్న కార్య‌క్ర‌మ‌ని వాపోయారు. కొన్ని వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ చేయ‌డం త‌న ధ‌ర్మ‌మ‌ని తెలిపారు. తాము చ‌ట్టాన్ని గౌర‌విస్తామే త‌ప్పా, ఎలాంటి ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు అక్కినేని నాగార్జున‌.

త‌ప్పుడు స‌మాచారం కార‌ణంగా కూల్చి వేశారంటూ వాపోయారు. అక్ర‌మ‌ నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంద‌న్నారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే త‌మ ప్రధాన ఉద్దేశమ‌ని తెలిపారు.