నిందితులను ఉరి తీయాలి
ఎస్డీఎఫ్ కన్వీనర్ మురళి
హైదరాబాద్ – దేశ వ్యాప్తంగా కదిలించిన సంఘటన ఉమ్మడి పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది. భూమి పంచాయతీ చివరకు ఓ మనిషి ప్రాణాన్ని తీసేలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
ఇంత దారుణమైన, క్రూరమైన హత్యపై సభ్య సమాజంలోని మేధావులు, బుద్ది జీవులు, ప్రజా హక్కుల నేతలు ఖండిస్తున్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్బంగా సోషల్ డెమోక్రటిక్ ఫోరం (ఎస్డీఎఫ్ ) కన్వీనర్ , సీనియర్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి. శుక్రవారం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.
ఈ సంఘటనను చూశాక తనకు భయం కలిగిందని, ఇంతకు మించి జుగుస్స అనిపిస్తోందని ఆవేదన చెందారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ను ఏర్పాటు చేసి మూడు నెలల్లో తీర్పు వచ్చేలా చేయాలని కోరారు.
బహిరంగంగా మనిషిని చంపిన వారిని ఉరి తీయాలని ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు.