ఆకునూరి మురళి ఆవేదన
హైదరాబాద్ – భారత రాజ్యాంగం అత్యంత ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు సోషల్ డెమోక్రటిక్ ఫోరం (ఎస్డీఎఫ్) కన్వీనర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి. బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం అవకాశవాద, నేర పూరితమైన రాజకీయాలు ఉన్నాయని వాపోయారు. ఇలాగే మౌనంగా ఉంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చిరంచారు.
అంతే కాదు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మహాశయుడు మనకు అందించిన రాజ్యాంగాన్ని గనుక కాపాడుకోలేక పోతే మైనార్టీలు, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలు, కార్మికులు, రైతులు తమ హక్కులను చాలా వరకు కోల్పోతారని హెచ్చరించారు ఆకునూరి మురళి.
రాజ్యాంగాన్ని మార్చకుండా మన హక్కులకు, అధికారాలకు భంగం కలగకుండా ఉండాలంటే రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ధనవంతులు, కార్పొరేట్లతో కూడిన భారతీయ జనతా పార్టీకి, మతతత్వ పార్టీలకు వత్తాసు పలక కూడదని సూచించారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని విలువైన ఓటును పని చేసే వారికి వేయాలని కోరారు.