అలంకృత సహాయ్ వైరల్
సోషల్ మీడియాలో హల్ చల్
ముంబై – ఫ్యాషన్ రంగంలో అలంకృత సహాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె ప్రముఖ మోడల్ గా గుర్తింపు పొందారు. తాజాగా వైరల్ గా మారారు. పసుపు రంగు ఆఫ్-షోల్డర్ గౌనులో సానుకూలత, ‘సూర్యకాంతి రంగుతో మెరుస్తూ దుస్తులలో కనిపించారు, ఈ కొత్త , ఆకర్షణీయమైన దుస్తులతో ఆమె అందం రెట్టింపయ్యింది. అందరినీ తన వైపు చూసేలా చేసింది.
అలంకృత సహాయ్ మోడల్ గా నటిగా పేరు పొందారు. నటిగా గొప్పగా మారడానికి ముందు అనేక ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన దివాలో తళుక్కున మెరిసింది . యువ ఫ్యాషన్ ప్రియులు , మోడల్‌లు ఎల్లప్పుడూ ఆమె నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు.
ఆమె ప్రస్తుతం వృత్తి పరంగా హ్యాపీ జోన్‌లో ఉంది, ముఖ్యంగా ఆమె తాజా చిత్రం ‘టిప్ప్సీ’ విజయం తర్వాత ఆమె పరిపూర్ణతతో ప్రధాన పాత్ర పోషించింది.
బ్రాండ్ షూట్‌ల కోసం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రయాణించడం నుండి బహుళ ప్రాజెక్ట్‌ల షూటింగ్ వరకు, అలంకృత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. వృత్తి పరంగా అన్ని ఒత్తిళ్లను జయించడమే కాకుండా పూర్తి అంకిత భావంతో కూడిన ప్రొఫెషనల్ మోడల్, నటిగా హల్ చల్ చేస్తోంది.
ఆమె ఇన్‌స్టాగ్రామ్ గేమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది . అలంకృత సహాయ్ వివిధ అవతార్‌లలో క్లాసీ , సొగసైన స్నాప్‌లను పోస్ట్ చేసినప్పుడల్లా చాలా మంది ఆశ్చర్యానికి లోనుకాక తప్పదు.
దివా అద్భుతమైన పసుపు ఆఫ్-షోల్డర్ ‘సన్‌షైన్’ గౌనులో మరెవ్వరికీ లేని విధంగా హృదయాలను కట్టి పడేసేలా తనను తాను ప్రూవ్ చేసుకుంది.