అసంతృప్త నేతలకు బాబు పిలుపు
టీడీపీ చీఫ్ తో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్
అమరావతి – తెలుగుదేశం పార్టీ తాజాగా జరగబోయే ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీతో కలిసి 99 సీట్లను ఖరారు చేసింది. ఈ మేరకు అభ్యర్థులను ప్రకటించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. 94 సీట్లకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేస్తే 5 సీట్లకు పరిమితమైంది జనసేన పార్టీ.
ఆయా నియోజకవర్గాలలో టికెట్లను ఆశించిన వారు తమకు టికెట్ దక్కక పోవడంతో పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు. మరికొందరు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగారు పార్టీ చీఫ్. వారిని బుజ్జగించే పనిలో పడ్డారు.
తెనాలి సీటును పొత్తులో భాగంగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు ఇచ్చారు . ఆయనకు సీటు ఖరారు కావడంతో ఇదే సీటును ఆశిస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చంద్రబాబు నాయుడును కలిసేందుకు అమరావతి వెళ్లారు.
గుంటూరు వెస్ట్ ఇవ్వాలని ఆలపాటి కోరగా యలమంచలి ఇవ్వాలని గోవింద్ ప్రతిపాదనలు పెట్టనున్నట్లు సమాచారం. ఆలపాటిని సముదాయించారు చంద్రబాబు నాయుడు. భేటీ అనంతరం సంతృప్తి వ్యక్తం చేశారు .