NEWSNATIONAL

బీజేపీ ఎంపీ పార్టీలో మ‌ద్యం పంపిణీ

Share it with your family & friends

త‌మ‌కేమీ తెలియ‌దంటున్న పోలీసులు

క‌ర్ణాట‌క – రాష్ట్రంలో కీల‌క‌మైన స‌న్నివేశానికి వేదిక‌గా మారింది బెంగ‌ళూరు న‌గ‌రం. సోమ‌వారం చిక్క‌బ‌ళ్లాపూర్ లోక్ స‌భ స్థానం నుంచి ఇటీవ‌లే ఎంపీగా భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థి కె. సుధాక‌ర్ గెలుపొందారు. తాను గెలిచిన సంద‌ర్బంగా బారీ ఎత్తున పార్టీ ఏర్పాటు చేశారు ఎంపీ.

ఈ సంద‌ర్బంగా జ‌నానికి ఉచితంగా మ‌ద్యం పంపిణీ చేశారు. ఇది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ లో వైర‌ల్ గా మారింది. జాతీయ మీడియా దీనిని హైలెట్ చేసింది. మ‌ద్యం బాటిళ్ల‌ను స్వీక‌రించేందుకు జ‌నం క్యూ క‌ట్టారు.

ఈ సంద‌ర్బంగా బెంగ‌ళూరు రూర‌ల్ ఎస్పీ సీకే బాబా స్పందించారు. ఈ మ‌ద్యం పంపిణీకి సంబంధించి త‌మ‌కు ఎలాంటి సంబందం లేద‌న్నారు. దీనికి అనుమ‌తి ఇచ్చింది ఎక్సైజ్ శాఖ అని, ఇది త‌మ ప‌రిధిలోకి రాద‌ని స్ప‌ష్టం చేశారు ఎస్పీ. ఏర్పాట్ల‌ను మాత్ర‌మే పోలీసులు చూసుకోవాల‌ని ఆదేశించామ‌న్నారు.

మ‌ద్యం పంపిణీ అనేది ఎంపీ స్వంత వ్య‌వ‌హారమ‌ని తాము జోక్యం చేసుకోలేమంటూ పేర్కొన్నారు.