ENTERTAINMENT

అంద‌రి క‌ళ్లు ర‌జ‌నీకాంత్ పైనే

Share it with your family & friends

వెట్టైయాన్ మూవీలో అన్నీ తానే

హైద‌రాబాద్ – లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణంలో భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కింది వెట్టైయాన్ చిత్రం. టీజీ జ్ఞాన‌వేల్ దీనిని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని చేశాడు. క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం త‌నే వెట్టైయాన్ కు. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా త‌లైవా ర‌జ‌నీకాంత్ మేన‌రిజం మ‌రోసారి తెర మీద ప్ర‌ద‌ర్శించేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు. ఇప్పుడు ఎక్క‌డ చూసినా వెట్టైయాన్ చిత్రం గురించే చ‌ర్చ జ‌రుగుతోంది.

తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన అనిరుధ్ ర‌విచంద‌ర్ చేసిన మ‌న‌సాలియో సాంగ్ టాప్ లో కొన‌సాగుతోంది. కోట్లాది మంది త‌లైవా అభిమానులు ఈ సాంగ్ ను హ‌మ్ చేస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్ద‌ల దాకా అంద‌రూ పాట‌లో లీన‌మై పోయారు.

మ‌రోసారి త‌న స్టామినా ఏమిటో చూపించే ప్ర‌య‌త్నం చేశారు ర‌జ‌నీకాంత్. ఇక ఈ చిత్రంలో భారీ తారాగ‌ణం ఉండ‌డం అద‌న‌పు ఆక‌ర్ష‌ణ అని చెప్ప‌క త‌ప్ప‌దు. బిగ్ బి ర‌జ‌నీకాంత్ , ఫాసిల్ , రాణా ద‌గ్గుబాటితో పాటు 40 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన మంజూ వారియ‌ర్ దుమ్ము రేపింది. ర‌జనీకాంత్ తో పోటీ ప‌డి న‌టించింది.

మ‌న‌సాలియో సాంగ్ లో ఇర‌గ‌దీసింది ఈ అమ్మ‌డు. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఈ సాంగ్ రికార్డుల మోత మోగిస్తోంది. ఇదిలా ఉండ‌గా త‌లైవా ఫ్యాన్స్ కు తీపిక‌బురు చెప్పారు ద‌ర్శ‌కుడు జ్ఞాన‌వేల్. వ‌చ్చే అక్టోబ‌ర్ ద‌స‌రా కానుక‌గా వెట్టైయాన్ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 20న ఆడియో ఫంక్ష‌న్ నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.