వైసీపీకి షాక్ ఆళ్ల నాని గుడ్ బై
వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా
అమరావతి – వైసీపీ బాస్ , ఏపీ మాజీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి , సీనియర్ పార్టీ నేత ఏలూరు జిల్లా పార్టీ చీఫ్ ఆళ్ల నాని అలియాస్ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
శుక్రవారం ఆయన రాజీనామా చేసిన లేఖను జగన్ రెడ్డికి పంపించారు. దీనిని సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు ఆళ్ల నాని. గత ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషించారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఏలూరు జిల్లాలో మంచి పట్టుంది ఆయనకు.
పార్టీ చీఫ్ గా కూడా పని చేస్తన్న ఆయన ఇవాళ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ రెడ్డికి పంపించిన రాజీనామా లేఖలో తాను వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో వేరే కారణాలు అంటూ లేవని పేర్కొన్నారు.
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఒక రకంగా భారీ షాక్ తగిలినట్లయింది పార్టీకి.