వైసీపీ కోసం క్యూ కట్టిన నేతలు
స్వంత గూటికి మంగళగిరి ఎమ్మెల్యే
అమరావతి – రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న ఈ తరుణంలో ఆయా పార్టీలకు జంప్ జిలానీలు ఎక్కువయ్యారు. ప్రధానంగా అధికార పార్టీ వైసీపలోకి భారీగా చేరేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్వంత గూటికి చేరుకున్నారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ బాస్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఆళ్ల రామకృష్ణా రెడ్డితో పాటు నూజివీడు మాజీ ఎమ్మెల్యే ముద్ర బోయిన కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మచిలీపట్టణం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ సైతం వైసీపీ వైపు చూడటం ఒకింత విస్తు పోయేలా చేసింది.
ఇక త్వరలోనే రాయచోటి మాజీ ఎమ్మెల్యే రెడ్డెప్ప గారి రమేష్ రెడ్డి వైసీపీ లో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత కుటుంబం సైతం వైసీపీ వైపు చూస్తున్నట్లు టాక్.
జగన్ రెడ్డి స్వంత ప్రాంతమైన కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు ఎక్కువయ్యాయి. కమలాపురం నుంచి సాయినాథ్ శర్మ, మైదుకూరు నుంచి వెంకట సుబ్బారెడ్డి కూడా చేరనున్నారు. ఇదే సమయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డితో కూడా చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.