యానాంలో కృష్ణా రావు పర్యటన
సమస్యలు పరిష్కరించాలని ఆదేశం
కేంద్ర పాలిత ప్రాంతం యానాంలోని పలు వీధుల్లో పర్యటించారు పుదుచ్చేరి ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. కురసాంపేటలో పర్యటించిన మల్లాడి కృష్ణారావు దృష్టికి పలు సమస్యలను తీసుకొచ్చారు స్థానికులు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి..అక్కడికి రప్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
మల్లాడి కృష్ణారావుకు అత్యంత జనాదరణ ఉంది. ఆయన నిత్యం ప్రజల కోసం పని చేసిన ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రజల మధ్యనే ఉంటూ వారితో కలిసి తలలో నాలుకలాగా ఉంటూ వచ్చారు. అందుకే ఆయనంటే అందరికీ గౌరవం..అంతకు మించిన ప్రేమ కూడా.
ఆయన ఏపీకి చెందిన తెలుగు వారు కావడం విశేషం. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో రేయింబవళ్లు వారి కోసమే పని చేస్తానని ఇప్పటికే ప్రకటిస్తూ వచ్చారు మల్లాడి కృష్ణారావు. ఆయనకు ఉన్న రాజకీయ అనుభవం దృష్ట్యా కీలకమైన పదవి దక్కింది. ఒకానొక సమయంలో తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.