NEWSTELANGANA

హైడ్రా పేరుతో వ‌సూళ్ల దందా – ఏలేటి

Share it with your family & friends

బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన హైడ్రాపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

హైడ్రా పేరుతో భారీ ఎత్తున వంద‌లు, వేల కోట్లు వ‌సూలు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే హైడ్రా పేరుతో దందా కొన‌సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

కేవ‌లం పేద‌లకు సంబంధించిన వాటిని ఎలా కూల్చి వేస్తారంటూ ప్ర‌శ్నించారు ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి. ఈ అడ్డ‌గోలు దందాకు పుల్ స్టాప్ పెట్లాల‌ని లేక‌పోతే తాము ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ముందు కూల్చాల‌ని అనుకుంటే హైద‌రాబాద్ అంత‌టా ఆక్ర‌మ‌ణ‌లే ఉన్నాయ‌ని ఆరోపించారు.

ద‌మ్ముంటే వాటిని కూల్చి వేయాల‌ని డిమాండ్ చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, ఏదో ఒక రోజు బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌ని అన్నారు. హైడ్రాకు చ‌ట్ట బ‌ద్ద‌త అంటూ ఏమైనా ఉందా అని నిలదీశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేశారు.