తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల – దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.
దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదని, దేవాలయాలు సమాజ అభివృద్ధికి దోహద పడతాయని ఈ సందర్బంగా స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్.‘దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
రోజు రోజుకు టెక్నాలజీ మారినా, ఆధిపత్యం వహించినా ఆధ్యాత్మికతకు మాత్రం అంతకంతకూ ప్రాధాన్యత పెరుగుతోందన్నారు బీఆర్ నాయుడు. ఈ తరుణంలో ప్రతి ఒక్కరు కుల, మతాలకు అతీతంగా ఆధ్యాత్మికత వైపు అందరూ అడుగులు వేస్తున్నారని తెలిపారు.
ప్రతి రాష్ట్ర రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయం ఉండాలన్నది తమ సంకల్పమన్నారు. దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలు ఉండాలని సీఎం ఆశయమన్నారు. కోట్ల మంది భక్తులు దేవాలయాలకు విరాళాలు ఇస్తున్నారని తెలిపారు బీఆర్ నాయుడు.
వాటిని విద్య, వైద్యం సహా ఇతర సేవ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు దేవాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని లేఖలో పేర్కొన్నారు.