శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్లు సాయం
దిల్ రాజుకు చెక్కులు అందించిన అరవింద్
హైదరాబాద్ – టీఎస్ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుతో పాటు నిర్మాత అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు. ఈ సందర్బంగా నటుడు అల్లు అర్జున్ , దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల తరపు నుంచి మొత్తం రూ. 2 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సాయానికి సంబంధించిన చెక్కులను దిల్ రాజుకు అందజేశామని తెలిపారు .
అల్లు అరవింద్. బాబు, పాపతో పాటు తండ్రి భాస్కర్ కు మేలు చేకూర్చేలా చేస్తామన్నారు. అల్లు అర్జున్ తరఫున రూ. కోటి, దర్శకుడు సుకుమార్ తరఫున రూ.50 లక్షలు, నిర్మాతల తరఫున మరో రూ.50 లక్షల పరిహారం ఇస్తున్నామని చెప్పారు అల్లు అరవింద్.
న్యాయ పరంగా చిక్కులు ఉండడంతో తాను వ్యక్తిగతంగా బాధితుడైన శ్రీతేజ్ ను కలవలేక పోతున్నానని అన్నారు. వైద్యులు అందించిన సమాచారం ప్రకారం శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని తెలిపారు. త్వరలోనే శ్రీతేజ్ మన మధ్య తిరుగుతాడాని ఆశిస్తున్నామని అన్నారు.
ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి సైతం తన వంతుగా పాపకు రూ. 2 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా రేపు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇచ్చాడని తామంతా కలుస్తున్నామని చెప్పారు దిల్ రాజు.