వయనాడు బాధితులకు బన్నీ సాయం
రూ. 25 లక్షలు ప్రకటించిన అల్లు అర్జున్
హైదరాబాద్ – ప్రముఖ నటుడు అల్లు అర్జున్ తన ఔదర్యాన్ని చాటుకున్నారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 లక్షల రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. ప్రకృతి ప్రకోపానికి వయనాడు విల విల లాడింది. భారీ వర్షాల తాకిడితో పాటు కొండ చరియలు విరిగి పడి 278 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనతో ఒక్కసారిగా కేరళ వణికి పోయింది. బాధితుల ఆర్తనాదాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.
ఈ తరుణంలో పలువురు సినీ నటులు స్పందిస్తున్నారు. తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటికే ప్రముఖ తెలుగు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవితో పాటు తనయుడు, హీరో రామ్ చరణ్ కూడా భారీ విరాళాన్ని ప్రకటించారు వయానాడు బాధితుల కోసం. ఈ మేరకు వారిద్దరూ కలిసి రూ. 1 కోటి సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యల చేశారు. వయనాడు ఘటన తనను కలిచి వేసిందన్నారు. కేరళ తనకు చాలా ప్రేమను పంచిందని గుర్తు చేసుకున్నారు. తను నటించిన ప్రతి సినిమాను ఎంతగానో ఆదరిస్తూ వస్తున్నారని తెలిపారు. తన వంతు సాయంగా ఈ చిరు విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.