నటుడు అల్లు అర్జున్ అరెస్ట్
చిక్కడపల్లి పీఎస్ కు తరలింపు
హైదరాబాద్ – ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి బిగ్ షాక్ తగిలింది. ఎవరూ ఊహించని రీతిలో పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్బంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్బంగా అల్లు అర్జున్ తన బౌన్సర్లతో కలిసి ఇక్కడికి వచ్చారు. అభిమానులపై బౌన్సర్లు , వ్యక్తిగత సిబ్బంది దాడికి పాల్పడ్డారు.
దీంతో తీవ్ర తొక్కిసలాటలో రేవంత్ అనే యువతి అదుపు తప్పి పడి పోయింది. ఆమె మృతి చెందింది శ్వాస ఆడక. మరొకరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ యజమానితో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా బెనిఫిట్ షో సందర్బంగా చోటు చేసుకున్న ఘటనలో రేవంత్ మృతి చెందడం విస్తు పోయేలా చేసింది. ఈ ఘటనకు ప్రధాన కారకుడు అల్లు అర్జున్ అంటూ ఆరోపించింది. ఆయన రావడంతోనే తొక్కిసలాట చోటు చేసుకుందన్నారు. శ్రీ తేజ కూడా తీవ్రంగా గాయపడ్డాడని , ప్రస్తుతం సీరియస్ గా ఉందని బాధితులు ఆరోపించారు.
ఈ మొత్తం ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యజమాని , ఇతరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటుడిని చిక్కడపల్లికి తరలించారు. కోర్టుకు సరెండర్ చేయనున్నారు పోలీసులు.