ఏసీపీ నేతృత్వంలో బన్నీ విచారణ
50కి పైగా ప్రశ్నలు సంధించిన పోలీసులు
హైదరాబాద్ – సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నటుడు అల్లు అర్జున్ మంగళవారం హైదరాబాద్ లోని చిక్కడపల్లి పీఎస్ కు హాజరయ్యారు. ఏసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. బన్నీ వెంట న్యాయవాది అశోక్ రెడ్డి కూడా ఉన్నారు. 50కి పైగా ప్రశ్నలను అల్లు అర్జున్ ముందు ఉంచి పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
బన్నీ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఇప్పటికే బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. చంచల్ గూడ జైలుకు తరలించారు. దీనిని సవాల్ చేస్తూ అల్లు అర్జున్ తరపు లాయర్ , వైసీపీ ఎంపీ తో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎట్టకేలకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తక్షణమే బన్నీని విడుదల చేయాలని ఆదేశించింది. అయినా పోలీసులు పట్టించు కోలేదు. రాత్రంతా జైలులో ఉంచారు. ఆయనకు ఖైదీ నెంబర్ ను కూడా కేటాయించారు.
ఆ తర్వాత అసెంబ్లీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై కౌంటర్ ఇచ్చారు బన్నీ. తన మామ చంద్రశేఖర్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించ లేదు. చివరకు నిన్నటి దాకా కాలర్ ఎగరేసుకుని తిరిగిన అల్లు అరవింద్ సైతం కొడుకును రక్షించు కునేందుకు నానా తంటాలు పడుతున్నారు.