తుది తీర్పు వెలువరించనున్న కోర్టు
హైదరాబాద్ – సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన కేసులో నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. డిసెంబర్ 30న బన్నీ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి.
తనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారు మారు చేస్తాడంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వవద్దంటూ కోరారు. విచారణకు సహకరిస్తున్నాడని, అల్లు అర్జున్ కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని వాదించారు లాయర్ , ఎంపీ నిరంజన్ రెడ్డి.
విచారణకు సహకరించక పోతే పోలీసులు అభ్యంతరం చెప్పాలని కానీ ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
అల్లు అర్జున్ పై పెట్టిన సెక్షన్ 105 BNS యాక్ట్ వర్తించదంటూ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు శుక్రవారం నాంపల్లి కోర్టు వెలువరించనుంది.
లక్షలాది మంది అభిమానులతో పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా కొడుకు శ్రీతేజ్ చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు.