షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్
హైదరాబాద్ – ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప2 ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కొన్ని సంఘటనలు తనను బాధ కలిగించాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తమ సినిమాను ఆదరించారని, ఊహించని రీతిలో సక్సెస్ కట్టబెట్టారన్నారు. ఏకంగా రూ. 2 వేల కోట్లకు పైగా వసూలు సాధించి రికార్డు సృష్టించిందన్నారు. భారీ విజయాన్ని కట్టబెట్టిన అభిమానులకు థ్యాంక్స్ తెలిపారు బన్నీ.
తనను పుష్పరాజ్ గా పిలిచేలా చేసిన ఘనత డైరెక్టర్ సుకుమార్ కు దక్కుతుందన్నారు. ఈ సందర్బంగా సినిమా కోసం భారీ ఎత్తున ఖర్చు చేసినందుకు మైత్రీ మూవీ మేకర్స్ కు థ్యాంక్స్ తెలిపారు అల్లు అర్జున్. తన సినీ కెరీర్ లో బిగ్ సక్సెస్ అయిన సినిమా పుష్ప 2 అని చెప్పారు.
తాను నటించిన ప్రతి సినిమా విడుదల సందర్బంగా సంధ్య థియేటర్ ను సందర్శించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తొక్కిసలాట ఘటనలో ఒకరు చని పోవడం బాధను కలిగించిందన్నారు. ఏది ఏమైనా టికెట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించిన ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలకు కూడా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు అల్లు అర్జున్.