అల్లు అర్జున్ ఖైదీ నెంబర్ 7697
అల్లు అరవింద్ అసహనం
హైదరాబాద్ – ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు షాక్ తగిలింది. తనకు మధ్యంతర బెయిల్ మంజూరైనా రాత్రంతా చంచల్ గూడ జైలులోనే గడిపారు. బన్నీకి జైలు అధికారులు ఖైదీ నెంబర్ 7697 కేటాయించారు. ఆలస్యం కావడంతో తండ్రి అల్లు అరవింద్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లి పోయారు. శనివారం ఉదయం విడుదల చేశారు.
ఇదిలా ఉండగా సినిమా వేరు నిజ జీవితం వేరు అని తేలి పోయింది. సినిమాలో నటించినంత ఈజీగా బయట ఉండదని అర్థమై ఉంటుంది బన్నీకి. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే. తన పని తాను చేసుకుంటూ పోతోంది. కానీ ఒకరికి ఒకలాగా మరొకరికి మరో లాగా అంటూ ఉండదు.
ఇదిలా ఉండగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చారు సినీ నటుడు అల్లు అర్జున్. ఆయనను దర్శకులు రాఘవేందర్ రావు సుకుమార్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్, రవి, దిల్‌రాజు, హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ కలిశారు. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన వీరందరూ తాజా పరిణామాల గురించి చర్చించారు. పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.