నాగబాబును కలిసిన అల్లు అర్జున్
కేసు గురించి వివరించిన నటుడు
హైదరాబాద్ – సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టై విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి ముందుగా మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. అక్కడ గంటకు పైగా సమావేశం అయ్యారు. లంచ్ చేసిన అనంతరం నేరుగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, నటుడు నాగబాబు కొణిదలను కలుసుకున్నారు. కేసు గురించి వివరించారు. తదుపరి ఏం చేయాలనే దానిపై చర్చించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. కలిసి ఉంటే కలదు సుఖం..విడిపోతే నష్ట పోతామని పేర్కొన్నారు. అంతకు ముందు అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు సినీ రంగానికి చెందిన ప్రముఖులు.
టెక్నీషియన్స్ , నటీ నటులు, దర్శకులు, నిర్మాతలు పరామర్శించారు. విచిత్రం ఏమిటంటే హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా చెంచల్ గూడ జైలు అధికారులు ఓకే చెప్పలేదు. సాంకేతిక కారణాల రీత్యా చెల్లుబాటు కాదంటూ స్పష్టం చేశారు.
అంతే కాదు పుష్ప నటుడికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఆయనకు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చేశారు. బన్నీకి నెంబర్ ఏర్పాటు చేశారు.