చట్టానికి లోబడి ఉంటా – అల్లు అర్జున్
కేసు గురించి మాట్లాడోనంటూ ప్రకటన
హైదరాబాద్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు చట్టం అంటే గౌరవం ఉందని, ప్రస్తుతం కేసు కోర్టులో ఉందని దాని గురించి ఇప్పుడేమీ మాట్లాడలేనని అన్నారు. మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని స్పష్టం చేశారు. రేవతి చని పోవడం బాధాకరమని , సానుభూతి తెలియ చేస్తున్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు బన్నీ.
జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడారు అల్లు అర్జున్. తన జీవితంలో ఇలాంటి సీన్ చోటు చేసుకుంటుందని అనుకోలేదని చెప్పారు. దీని గురించి తాను మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఏమీ చెప్పలేనని అన్నారు బన్నీ.
సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటన అత్యంత బాధాకరమని, ఇప్పటికే తాము ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించామన్నారు . తాను వ్యక్తిగత పనుల వల్ల పరామర్శించలేక పోయానని చెప్పారు అల్లు అర్జున్. న్యాయ స్థానం పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు. ఇప్పటికిప్పుడు దాని గురించి మాట్లాడటం చట్టాన్ని , పరిధిని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు అల్లు అర్జున్.
తనకు వెన్నంటి ఉంటూ మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థ్యాంక్స్ చెబుతున్నట్లు ప్రకటించారు.