శ్రీతేజ కోలుకోవాలని ప్రార్థిస్తున్నా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
హైదరాబాద్ – పుష్ప-2 ప్రీమియర్ షో ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో వెంటిలేటర్ మీదున్న శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే రేవతి చని పోయింది. ఈ సందర్బంగా జైలు నుంచి విడుదలైన నటుడు అల్లు అర్జున్ ఆలస్యంగా స్పందించాడు. శ్రీతేజ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నాడు. ఆస్పత్రి, కుటుంబ అవసరాలకు తాను అండగా ఉంటానని ప్రకటించాడు.
ఆయన ఎక్స్ వేదికగా స్పందించాడు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తన కేసుకు సంబంధించి కోర్టు పరిధిలో ఉండడంతో కలవకూడదని న్యాయ నిపుణులు తనతో చెప్పారని తెలిపారు అల్లు అర్జున్.
అయితే సాధ్యమైనంత త్వరలోనే శ్రీ తేజను తాను కలిసేందుకు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బన్నీకి ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు తెలంగాణ పోలీసులు. ఆయనను ఇంట్లో ఉండగానే నోటీసు ఇచ్చి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి చిక్కడపల్లి స్టేషన్ కు తరలించారు. ఆగమేఘాల మీద ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకు వెళ్లగా జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
దీనిని సవాల్ చేస్తూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి శ్రీదేవి బెయిల్ మంజూరు చేసింది.