మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కామెంట్స్
హైదరాబాద్ – మరోసారి మీడియా ముందుకు వచ్చారు ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తనకు మద్దతు ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని అన్నారు.
గత 20 ఏళ్లుగా తాను సంధ్య థియేటర్ లో సినిమా చూస్తున్నానని చెప్పారు అల్లు అర్జున్. రేవతి చని పోవడం దురదృష్టకరమని , దానికి తాను చింతిస్తున్నానని అన్నారు. ఆమె కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పారు. ఇదే సమయంలో రేవతి కుమారుడు శ్రీ తేజను పరామర్శిస్తానని తెలిపారు.
జరిగిన ఘటనకు సంబంధించి తాను బాధిత కుటుంబానికి క్షమాపణ చెబుతున్నాని అన్నారు.. ఒకరు చనిపోవడం దురదృష్టకరమైన ఘటన అన్నారు.
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన మా కంట్రోల్‌లో లేదన్నారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ పై పలు కేసులు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. చంచల్ గూడ జైలులో ఒక రోజు ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో నిన్న అక్కడే ఉండి శనివారం ఇంటికి వచ్చారు. ఆయనను పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు కలిశారు.