ENTERTAINMENT

టికెట్ రేట్లు పెంచినందుకు థ్యాంక్స్

Share it with your family & friends

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

అమరావ‌తి – ఏపీ ప్ర‌భుత్వం పుష్ప -2 ది రూల్ మూవీకి సంబంధించి టికెట్ల రేట్ పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చినందుకు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

స‌హ‌క‌రించినందుకు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కూడా థ్యాంక్స్ తెలియ చేశారు. ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం రేట్లు పెంచుకునేందుకు ఇప్ప‌టికే ఓకే చెప్పింది. ఈనెల 5న ప్ర‌పంచ వ్యాప్తంగా మూవీ రిలీజ్ కానుంది 12 వేల థియేట‌ర్ల‌లో.

ఇదిలా ఉండ‌గా రిలీజ్ కాకుండానే రికార్డులు సృష్టించింది ఈ చిత్రం. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణ సార‌థ్యంలో డైన‌మిక్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీశ్రీ ప్ర‌సాద్ ఇచ్చిన పాట‌లు దుమ్ము రేపుతున్నాయి. ఇప్ప‌టికే రూ. 1000 కోట్లు వ‌సూలు చేసింద‌ని, విడుద‌ల త‌ర్వాత రూ. 2,000 కోట్లు వ‌సూలు చేయొచ్చ‌ని సినీ ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.