Wednesday, April 9, 2025
HomeNEWSనా స్థ‌లం పోకుండా చూడండి - బ‌న్నీ మామ‌

నా స్థ‌లం పోకుండా చూడండి – బ‌న్నీ మామ‌

ప్ర‌జా వాణిలో ఫిర్యాదు చేసిన చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి

హైద‌రాబాద్ – ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పిల్ల‌ను ఇచ్చిన స్వంత మామ వైర‌ల్ గా మ‌రారు. సోమ‌వారం ఆయ‌న ప్ర‌జావాణికి వ‌చ్చారు. త‌న స్థ‌లం పోకుండా చూడాలంటూ విన‌తిప‌త్రం అందించారు. ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన భూ సేక‌ర‌ణ‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని కోరారు.

ప్ర‌స్తుతం ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ ను కూడా ఆశించారు. భూసేకరణ లో భాగంగా తన ఆస్తిని ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో కేబీఆర్ పార్క్ సమీపంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 92 లోని తన ఇంటిపై రోడ్డు విస్తరణ ప్రాజెక్టు ప్రభావం చూపుతుందని వాపోయారు.

ప్రతిపాదిత విస్తరణ తన ప్లాట్ కు సంబంధించి ఒక వైపు నుండి 20 అడుగులు , మరొక వైపు నుండి 36 అడుగులు పడుతుందని చంద్రశేఖర్ రెడ్డి తన ఫిర్యాదులో హైలైట్ చేశారు. భూసేకరణ ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని అధికారులను కోరారు.

కొన్ని నెలల క్రితం ప్రభుత్వం కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను ప్రకటించింది, ఈ ప్రాజెక్టు కోసం రూ. 1,100 కోట్లు కేటాయించింది, ఇందులో రోడ్డు విస్తరణ వంటి బహుళ మౌలిక సదుపాయాలు ఉన్నాయి.

తొక్కిసలాట కేసుకు సంబంధించి గతంలో అరెస్టయిన అల్లు అర్జున్ చుట్టూ వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments