Thursday, April 3, 2025
HomeNEWSTELANGANAహైకోర్టులో అల్లు అర్జున్ మామ పిటిషన్

హైకోర్టులో అల్లు అర్జున్ మామ పిటిషన్

సీఎం రేవంత్ రెడ్డి క‌ల‌ల ప్రాజెక్టుపై

హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుగా చెప్పుకునే కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణను వ్యతిరేకిస్తూ.. తన ఇంటిని కూల్చొద్దని, పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణ కార్యకలాపాలను నిలువరించాలని కోరుతూ హైకోర్టులో వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ నేత , అల్లు అర్జున్ మామ కంచ‌ర్ల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి. ఇప్పటికే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కోర్టులో నాలుగు పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. కాగా మాజీ మంత్రి పి. జానా రెడ్డి, న‌టుడు బాల‌కృష్ణ‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖుల ఇళ్లు ఉన్నాయి.

ఇదిలా ఉండ‌గా పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్క్ చుట్టూరా ఫ్లైఓవర్లు, అండర్ పాసులు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నదని.. ఈ విస్తరణ ప్రాజెక్టులో తన ఇంటిని సంరక్షించాలని కోరుతూ ఇప్పటికే ప్రజావాణిలో దరఖాస్తు చేశారు బ‌న్నీ మామ‌ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. విచిత్రం ఏమిటంటే ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టికెట్ ఆశించారు.

మ‌రో వైపు పుష్ప‌-2 కేసు సంద‌ర్బంగా మ‌రోసారి లైమ్ లైట్ లోకి వ‌చ్చారు కంచ‌ర్ల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments