అల్లూరి సీతారామ రాజు స్మారక అవార్డు
హైదరాబాద్ – నవభారత్ నిర్మాణ సంఘం – పాలడుగు నాగయ్య కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో , డిప్యూటీ చీఫ్ రిపోర్టర్ వరకాల యాదగిరికి అల్లూరి సీతారామరాజు స్మారక పురస్కారాన్ని ప్రధానం చేశారు. రవీంద్రభారతిలో ఏర్పాటైన కార్యక్రమంలో పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి చేతుల మీదుగా యాదగిరిని ఘనంగా సన్మానించి జ్ఞాపిక, నగదు పురస్కారంతో అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత వైమానిక దళ రిటైర్డ్ మేజర్ జనరల్ ఎం. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మూడున్నర దశాబ్దాలుగా తెలుగు జర్నలిజం రంగంలో యాదగిరి అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రధానం చేసినట్టు పాలడుగు నాగయ్య కలాపీఠం, నవభారత్ నిర్మాణ సంఘం ప్రతినిధులు తెలిపారు. విశ్వావసు ఉగాది వేడుకల సందర్భంగా తేట తెనుగు తెలుగు కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి తుమ్మ జనార్ధన్ కు పాలడుగు నాగయ్య స్మారక పురస్కారాన్ని ప్రధానం చేశారు.