వీహెచ్‌పీ చీఫ్ గా అలోక్ కుమార్
ప్రధాన కార్యదర్శిగా భాంగ్రా
న్యూఢిల్లీ – దేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పార్టీకి ఆయువుపట్టుగా భావించే అన్ని సంస్థలలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి కూడా హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది బీజేపీ. ఈ మేరకు పార్టీకి అండదండలు అందిస్తూ వస్తున్నాయి విశ్వ హిందూ పరిషత్ , రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ , అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ , భజరంగ్ దళ్ , ఆయోధ్య రామ జన్మ భూమి ట్రస్ట్ .
తాజాగా వీహెచ్ పీకి సంబంధించి ఎన్నికలు జరిగాయి. జాతీయ అధ్యక్షులుగా అలోక్ కుమార్ జీ, ప్రధాన కార్యదర్శిగా కైలాష్ భజరంగీ లాల్ భాంగ్రా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయోధ్య నగరంలోని కరసేవక్ పూర్ లో మూడు రోజుల పాటు వీహెచ్ పీ కేంద్ర బోర్డు, సర్వ సభ్య సమావేశం జరగనుంది.
ఇవాళ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఎన్నిక తరువాత విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత సంఘటనా మంత్రిగా మిలింద్ పరాండేని, సహ సంఘటనా మంత్రిగా వినాయక్ రావు దేశపాండేని నూతన అధ్యక్షులు నియమించారు. ఈ సందర్బంగా వీహెచ్ పీ చీఫ్ అలోక్ కుమార్ మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో హిందువుల కోసం మాట్లాడే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.