నిప్పులు చెరిగిన అంబటి రాంబాబు
అమరావతి – మాజీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనాడూ ప్రాజెక్టుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జల హారతి కాదు చంద్రబాబు హారతి అంటూ ఎద్దేవా చేశారు. ప్రచారం చేసుకోవడంలో తనను మించిన సీఎం దేశంలోనే లేరన్నారు రాంబాబు.
మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. కొత్తగా గోదావరి – బనకచర్లని కూడా తనదే అంటూ చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు.చివరికి ఈ ప్రాజెక్టును కూడా ప్రైవేటు పరం చేయబోతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
పోలవరం ప్రాజెక్టును కృష్ణా జలాలతో పాటు రాయలసీమకు అనుసంధానం చేసిన వ్యక్తి వైఎస్సార్ అని స్పష్టం చేశారు. గోదావరి బనకచర్ల మూడు దశల్లో పూర్తి చేయాలనుకున్నారని స్పష్టం చేశారు. 280 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు తరలించేలా జగన్ ప్రభుత్వం చేశారని చెప్పారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబే కనిపెట్టినట్టు మాట్లాడటం సిగ్గు చేటు అని పేర్కొన్నారు.